Abn logo
Oct 24 2020 @ 05:32AM

పోలీసు అమరుల త్యాగం గొప్పది

 పోలీస్‌ కమిషనర్‌ విబి కమాలసన్‌రెడ్డి


గన్నేరువరం అక్టోబర్‌ 23 : పోలీసు అమరవీరుల త్యాగం గొప్పదని పోలీసు కమిషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. గన్నేరువరంలో పోలీస్‌ అమర వీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ విబి కమాలసన్‌రెడ్డి హాజరై ఫైనల్‌ మ్యాచ్‌ తిలకించారు. రసవత్తరంగా జరిగిన ఆటలో హన్మాజిపల్లిపై గన్నేరువరం కబడ్డీ జట్టు గెలుపొందింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విధి నిర్వహణలో 47 మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారన్నారు.  గన్నేరువరం మండలంలోని 16 గ్రామాలలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లాలోనే వంద శాతం సీసీ కెమెరాలు గల మండలంగా గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మాల్లారెడ్డి, జడ్పీటీసీ మాడ్గుల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement