Abn logo
Sep 21 2021 @ 23:37PM

మొక్కలను సంరక్షించాలి

రికార్డులను పరిశీలిస్తున్న పీడీ :


లావేరు: ఉపాధి హామీ పథకంలో భాగంగా నాటిన మొక్కలు శతశాతం బతికే విధంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని డ్వామా పీడీ హనుమంతు కూ ర్మారావు ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. మంగళవా రం గుమడాం రహదారికి ఇరువైపులా నాటిన ఎవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలను ఆయన పరిశీలించారు.   మొక్కల చుట్టూ ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. రికార్డుల నిర్వాహణ సక్రమంగా ఉండాలన్నారు. సిబ్బంది బాద్యతగా పని చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ శైలజ, ఏపీవో ఆర్‌.సత్య వతి, జేఈ లెనిన్‌బాబు, టీఏలు హైమావతి, గౌతమ్‌, ఎఫ్‌ఏలు రామసత్యం, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.