Advertisement
Advertisement
Abn logo
Advertisement

శాశ్వత గృహ హక్కు పథకాన్ని వేగవంతం చేయాలి: జడ్పీ సీఈవో

సిద్దవటం, నవంబరు27 : గ్రామాల్లో పారిశుధ్యాన్ని పరిరక్షించాలని జడ్పీసీఈవో సుధాకర్‌రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల కేంద్రమైన సిద్దవటం ఎంపీడీవో కార్యాలయాన్ని శనివారం జడ్పీ సీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వర్షాబావ పరిస్థితులతో గ్రామాల్లోని ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు నీటి నిల్వలున్న చోట బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించాలన్నారు. మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయించాలన్నారు. తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించాలన్నారు. అలాగే బొగ్గిడివారిపల్లె సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రతాప్‌, ఈవోపీఆర్‌డీ పద్మనాభరెడ్డి, సంపద తయారీ కేంద్రాల జిల్లా కో-ఆర్డినేటర్‌ సురే్‌షబాబు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement