Abn logo
May 28 2020 @ 23:45PM

ఏపీ ముఖ్యమంత్రికి నిర్మాతల మండలి వినతి

నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్టూడియోలు, ల్యాబులు సహా పరిశ్రమ వర్గాల ఇళ్లకు అవసరమైన స్థలాలను కేటాయించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విన్నవించింది. ఈ మేరకు జగన్‌కి నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌, కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్‌, మోహన్‌ వడ్లపట్ల బుధవారం ఓ లేఖ రాశారు. ఏపీలో ప్రభుత్వానికి చెందిన ప్రాంతాలు, ప్రాంగణాలను చిత్రీకరణకు ఉచితంగా ఇవ్వాలని ఆదేశిస్తూ జీవో విడుదల చేసినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఆ లేఖను ఏపీఎ్‌ఫడిసి అధ్యక్షుడు విజయ్‌చందర్‌, ఎండి టి. విజయ్‌కుమార్‌రెడ్డికి అందించారు.


Advertisement
Advertisement
Advertisement