Abn logo
May 28 2020 @ 23:51PM

సమీప బంధువు మరణించడం వల్లే రాలేకపోయా

‘‘మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌గారు కేవలం సినీ కార్మికులకే కాకుండా టీవీ రంగంలో వారికీ సాయం చేస్తుండడం మంచి విషయం. చిత్ర పరిశ్రమ తరఫున వారికి ధన్యవాదాలు’’ అని చిరంజీవి అన్నారు. అన్నపూర్ణ ఏడెకరాలు స్టూడియోలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. సమీప బంధువు మరణించడం వల్ల హాజరు కాలేకపోయానని ఆయన తెలిపారు. ‘‘పరిశ్రమకు, ప్రభుత్వానికి తలసాని శ్రీనివాస యాదవ్‌గారు సంధాన కర్తగా ఉండి... అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. ఇప్పుడీ కష్టకాలంలో చేదోడు, వాదోడుగా ఉంటూ ఆయన చేస్తున్న కృషి, సేవ అభినందనీయం. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని చిరంజీవి అన్నారు.


Advertisement
Advertisement
Advertisement