Abn logo
Sep 26 2021 @ 21:59PM

యువతి సెల్ఫీ పిచ్చి.. కోతి ముందే తిక్క చేష్టలు.. చివరకు..

సెల్ఫీలు తీసుకోవడం యువతకు కామన్ అయింది. సెకను సెకనుకు తాము ఏం చేస్తున్నామో అందరికీ తెలియజేయాలనే తపనలో మునిగిపోతున్నారు. ఈ పిచ్చిలో పడి ఎక్కడున్నాం.. ఎవరితో ఫొటో దిగుతున్నాం.. అనే సంగతి కూడా మర్చిపోతున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంటారు. అయితే మనం చెప్పుకోబోయే యువతి.. కొంచెం వినూత్నంగా ఆలోచించింది. చివరికి జ్ఞానోదయం కలిగి..  ఈ సెల్ఫీలు వద్దురా నాయనా అంటూ పరుగందుకుంది... 


సెల్ఫీల పిచ్చి పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ అలవాటుగా మారిపోయింది. ఇక్కడ ఓ యువతి.. చెట్టుకు కట్టేసి ఉన్న ఓ కోతిని చూసి ముచ్చట పడింది. అన్ని కోతులూ ఒకలా ఉంటాయి కదా అనుకుంది. గొలుసుతో కట్టారు కదా ఏం చేస్తుందిలే.. ఓ సెల్ఫీ తీసుకుంటే పోలా.. అనుకుంది. తన స్నేహితురాలికి ఫోన్ ఇచ్చి ఫొటో తీయమంది. కోతి దగ్గరకు వెళ్లి మంచి ఫోజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. 


అసలే బంధీగా ఉన్న కోతికి ఈ యువతి పిచ్చి చేష్టలు చూసి చిర్రెత్తుకొచ్చింది. నా ముందే కోతి చేష్టలా అనుకుందో ఏమో.. ఒక్కసారిగా ఆ యువతి మీదకు దూకింది. అంతటితో ఆగకుండా ముక్కు, తలపై చేతులతో రక్కింది. ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్న ఆ యువతి.. ఎలాగోలా విడిపించుకుని, అక్కడి నుంచి పరుగందుకుంది. తలకు స్కార్ఫ్ కట్టుకుని ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో చూసి.. నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...