Abn logo
Oct 13 2021 @ 23:57PM

టిప్పర్‌ ఢీ కొని వ్యక్తి మృతి


బాన్సువాడ, అక్టోబరు 13: మండలంలోని కొల్లూర్‌ గ్రామ సమీపంలో టిప్పర్‌ ఢీ కొని బీర్కూర్‌కు చెందిన బూతుపల్లి అంజయ్య (45) అనే వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.... బీర్కూర్‌ నుంచి బాన్సువాడకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో టిప్పర్‌ ఢీ కొనడంతో అంజయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం.