Abn logo
Sep 26 2020 @ 05:10AM

కరోనా కోరల్లో..కందనూలు

Kaakateeya

తాజాగా 157 మందికి వైరస్‌

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 424 మందికి పాజిటివ్‌


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)గద్వాల క్రైం/నారాయణపేట క్రైం/నాగర్‌కర్నూల్‌ క్రైం, సెప్టెంబరు 25 : కందనూలు కరోనా కోరల్లో చిక్కుకుంది. నానాటికి ఈ జిల్లాలో వైరస్‌ ఉధృతి తీవ్రమవుతోంది. గురువారం ఈ జిల్లాలో 157 మందికి వైరస్‌ సోకగా, తాజాగా మళ్లీ 157 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 424 కేసులు నమోదయ్యాయి.


మహబూబ్‌నగర్‌ జిల్లాలో 90 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలోనే 33 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అదే విధంగా జిల్లాలోని వివిధ మండలాల్లో 57 పాజిటివ్‌ కేసులు రాగా, అత్యధికంగా జడ్చర్లలో 21 మందికి వైరస్‌ సోకింది.


జోగుళాంబ గద్వాల జిల్లాలో 77 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలోనే 13 కేసులు నమోదు కాగా, అత్యధికంగా అయిజలో 27 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన 37 కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి.


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తాజాగా మళ్లీ 157 మందికి కరోనా సోకింది. అత్యధికంగా అచ్చంపేటలో 32 మందికి, నాగర్‌కర్నూల్‌లో 24 మందికి, కొల్లాపూర్‌లో 19 మందికి, బిజినేపల్లిలో 16 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన 66 కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి.


వనపర్తి జిల్లాలో మొత్తం 65 కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా వనపర్తి మండలంలో 44 మందికి కరోనా సోకింది. మిగిలిన 21 కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి.


నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 35 మందికి కరోనా సోకింది. మరికల్‌లో ఐదుగురికి, మక్తల్‌లో ముగ్గురికి, చింతల్‌దిన్నెలో నలుగురికి కరోసా సోకగా, మిగిలిన 23 కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి.

Advertisement
Advertisement
Advertisement