Abn logo
Oct 10 2020 @ 03:03AM

కబ్జా నుంచి భూమిని కాపాడాలి

ఆమనగల్లు : పట్టణ సమీపంలో ప్రభుత్వం దశాబ్దాల క్రితం నిరుపేదలమైన తమకు ఇచ్చిన అసైన్డ్‌ భూమిని కొందరు రియల్టర్లు ఆక్రమిస్తున్నారని వారి నుంచి భూములను కాపాడాలని రైతులు కోరారు. శుక్రవారం తహసీల్దార్‌ చందర్‌రావుకు వినతిపత్రం అందచేశారు.  సర్వేనెంబర్లు 727/52, 727/36/4, 727/36/2, 727/36/3లలో 35 గుంటల భూమిని కొందరు ఆక్రమించి చదును చేస్తున్నారని తెలిపారు. భూమిని తమకు అప్పగించి న్యాయం చేయాలని బాధిత రైతులు మౌలానా, యాదగిరి, శరత్‌, నందీశ్వర్లు కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ వారికి హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement