Abn logo
May 1 2020 @ 00:34AM

వడ్డీ భారం తగ్గించాలి

కరోనా వ్యాప్తి నివారణ కోసం లాక్‌ డౌన్ ప్రకటించిన నెల రోజులకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు ఆర్థికంగా కుదేలై అవస్థలు పడుతున్నాయి. ఇక ప్రజల పరిస్థితి, మరీ ముఖ్యంగా ఈఎంఐలపై ఆధారపడ్డ వర్గాల పరిస్థితి దారుణంగా తయారు కానున్నది. లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం అన్ని రకాల రుణాలపై మూడు నెలల మారటోరియమ్ విధించడం ఊరటే అయినప్పటికీ, వాయిదాలపై వడ్డీ రూపంలో పిడుగు పడుతున్నది. ఆదా యం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్న కాలంలో వాయిదాలపై వడ్డీ మాఫీ చేయమని వేడుకున్నా ప్రభు త్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోగా, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ మారటోరియం కోసం అప్లై చేసుకున్న వినియోగదారులకు క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో కోత విధించింది.


ఇక ప్రైవేట్ బ్యాంకుల దాష్టీకం చెప్పనక్కరలేదు. అన్నదాతకు రుణం మంజూరు చేయటంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తాయి. పేద, మధ్యతరగతి ప్రజల రుణాన్ని ముక్కు పిండి వసూలు చేస్తాయి. కానీ, కార్పొరేట్ సంస్థలు, బడా ఎగవేతదారుల రుణాలను పారు బకాయిల్లో జమ చేస్తాయి. ఇలాంటి బ్యాంకులకు ఈఎంఐలపై వడ్డీ రద్దు చేయడం పెద్ద నష్టం కాదు. ప్రభుత్వం ఈమేరకు ఆదేశాలిచ్చి ప్రజల్ని ఆదుకోవాలి. 

గుండు కరుణాకర్, వరంగల్

Advertisement
Advertisement
Advertisement