Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీలోకి 40 కుటుంబాల చేరిక

కంభం, డిసెంబరు 8 : కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని సంజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన 40 కుటుంబాల వారు మాజీ ఎ మ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కంభం మండల అధ్యక్షుడు తోట శ్రీనివాసులు, పార్లమెంట్‌ కార్యనిర్వహణ కార్యదర్శి కేతం శ్రీను, కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే నివాళి

గిద్దలూరు, డిసెంబరు 8 : మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ పీరా సతీమణి పీరాంభీ అనారోగ్యంతో మృతి చెందగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌ రామసుబ్బయ్య, నాయకులు నంది శ్రీను, వెంకటసుబ్బయ్య, షెక్షావలి ఉన్నారు. 


Advertisement
Advertisement