Abn logo
Sep 22 2021 @ 01:08AM

ఐరాలలో అత్యధికంగా 93.2 మి.మీ. వర్షపాతం

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. ఐరాలలో అత్యధికంగా 93.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. వి.కోటలో 86.6, గుడుపల్లెలో 83.2, కుప్పంలో 75, బైరెడ్డిపల్లెలో 58.6, పాకాలలో 37.2, పెనుమూరులో 34.4, జీడీనెల్లూరులో 33.2, శాంతిపురంలో 30.2, రామకుప్పంలో 28.8, సత్యవేడులో 26.6, బంగారుపాళ్యంలో 25.6, పెద్దపంజాణిలో 23.8, సోమలలో 18.6, యాదమరిలో 15.2, ఆర్‌సీపురంలో 13.6, పూతలపట్టులో 11.6, నిమ్మనపల్లెలో 10.6, పుంగనూరులో 10.4 మి.మీ వర్షపాతం నమోదవగా, మిగిలిన మండలాల్లో 10.4 మి.మీకంటే తక్కువ వర్షం కురిసింది.