Abn logo
Jul 11 2020 @ 04:36AM

ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, జూలై 10:   ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి కోరారు. శుక్రవారం హన్మకొండలో టీఏపీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు చందర్‌లాల్‌ చౌహాన్‌ నాయక్‌ శ్రీపాల్‌రెడ్డిని, టీపీయూఎస్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు చిదురాల సుధాకర్‌ను కలిసి  ప్రైవేటు ఉపాధ్యాయుల వేతనాలపై ప్రభుత్వానికి విన్నవించాలని  వినతి పత్రాలు అందజేశారు. ఇరువురు సమస్యను పరిష్కరించేందుకు సంఘం పక్షాన కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఏపీటీఏ సలహాదారు సూర్యప్రకాశ్‌, ఉపాధ్యక్షుడు ముకుందం, కన్వీనర్‌  రాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement