Abn logo
Aug 6 2020 @ 01:33AM

చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

గద్వాల టౌన్‌ ఆగస్టు 5 : లాక్‌ డౌన్‌తో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత పద్మాశాలీ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేశ్‌ కోరారు. పద్మాశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శంభునాథ మఠం ఆవరణలో చేనేత కార్మికులు బుధవారం మూడు రోజుల నిరాహార దీక్షను ప్రారంభించారు.


ఈ సందర్భంగా పులిపాటి వెంకటేశ్‌ మాట్లాడుతూ పేరుకుపోయిన చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు. దీక్షలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్ని నాగరాజు, మెడం రామకృష్ణ, తిరుమల సత్యనారాయణ, సారంగి శేఖర్‌, గడ్డం శ్యామ్‌, రమేశ్‌ తదితరులున్నారు. కౌన్సిలర్‌ శ్రీమన్నానారాయణ వారికి సంఘీభావం ప్రకటించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రజాప్రతినిధుల తరఫున కృషి చేస్తామన్నారు. 

Advertisement
Advertisement