Abn logo
Sep 21 2020 @ 01:13AM

కులవృత్తుల జీవనోపాధికి ప్రభుత్వం పెద్దపీట

ఆమనగల్లు : కులవృత్తుల సంక్షే మం, జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బాలాజీ సింగ్‌ అన్నారు. ఆమనగల్లు పట్టణంలో ఆదివారం పూసల కులస్థుల సమావేశం నిర్వహించారు. పూసల సంఘం భవన నిర్మాణం, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించారు.


ఈ సందర్భంగా బాలాజీ సింగ్‌ భవన నిర్మాణానికి ప్రకటించిన రూ.లక్ష విరాళంలో భాగంగా రెండో విడత రూ.51వేలు టీఆర్‌ఎ్‌స్‌ ఆమనగల్లు మున్సిపాలిటీ కన్వీనర్‌ అప్పం శ్రీను, పూసల సంఘం జిల్లా నాయకుడు పస్పులేటి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌వస్పుల జంగయ్యలతో కలిసి మండల నాయకులకు అందజేశారు. పూసల కులస్తులను ఎంబీసీ జాబితాలో చేర్చేలా చొరవ తీసుకోవాలని బాలాజిసింగ్‌ను సంఘం నాయకులు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం బాలాజిసింగ్‌ను నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ్మ, వెంకటేశ్‌, భాస్కర్‌, రాము, నరేందర్‌, లక్ష్మణ్‌, యోగి, మల్లేశ్‌, పరమేశ్‌, సతీశ్‌, సయ్యద్‌ ఖలీల్‌, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement