Abn logo
Oct 23 2020 @ 04:49AM

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ


ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తమ నివాసాల్లో గురువారం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లికి చెందిన మల్లేశ్‌కు రూ.ఒక లక్ష, మాడ్గుల మండలం కాట్రాంతండాకు చెందిన రవీందర్‌కు రూ. 8 వేలు, కొర్రత ండాకు చెందిన నానుకు రూ.12 వేలు, ఆమనగల్లు మండలం కొత్తకుంట తండాకు చెందిన నరేందర్‌కు రూ.18వేలు, మేడిగడ్డ తండాకు చెందిన రమేశ్‌కు రూ.20 వేల చొప్పున మంజూరైన సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అందజేశారు. కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, నాయకులు నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, గంప వెంకటేశ్‌, సర్పంచ్‌ స్వప్న భాస్కర్‌రెడ్డి, రమేశ్‌ రెడ్డి, రాజ వర్దన్‌ రెడ్డి, చంద్రునాయక్‌, గొర్రె పవన్‌కుమార్‌, రెడ్డి, జైపాల్‌రెడ్డి, కృష్ణగౌడ్‌, శివ,శంకర్‌, సత్తయ్య, రాజు పాల్గొన్నారు.


అదే విధంగా తలకొండపల్లి మండలం రాంపూర్‌కు చెందిన భీమమ్మకు రూ.14 వేలు మంజూరు కాగా మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌ అందజేశారు. కార్యక్ర మంలో శ్రీశైలం యాదవ్‌, యాదయ్య, అంజి, జంగయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు పట్టణానికి చెందిన పి.సత్యానికి రూ.2 లక్షలు, కడ్తాలకు చెందిన శిశుపాల్‌కు రూ.60 వేలు, కె.హైమావతికి రూ.15 వేలు, సాలార్‌పూర్‌కు చెందిన కె.మ హేశ్‌కు రూ.26 వేలు, తలకొండపల్లి మండలం రాంపూర్‌కు చెందిన కల్యాణికి రూ.16 వేలు, కల్వకుర్తి మండలం తాండ్రకు చెందిన సీహెచ్‌ శకుంతలకు రూ.33వేల చొప్పున మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్‌తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో గూడూరు భాస్కర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌, యాదగిరిరెడ్డి, మహేంద్‌రెడ్డి, విజయ్‌రాథోడ్‌, శ్రీనునాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement