Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఔటర్‌పై గ్యాస్‌ట్యాంకర్‌ బోల్తా

ఆదిభట్ల: గ్యాస్‌ట్యాంకర్‌ డివైడర్‌ను ఢీకొని పల్టీకొట్టిన సంఘటన ఆదిభట్ల పరిధి కొంగరకలాన్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ నరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్‌ట్యాంకర్‌  16,500లీటర్ల లిక్వి డ్‌ గ్యాస్‌తో చెన్నై నుంచి శంషాబాద్‌కు వెళ్తోంది. కొంగరకలాన్‌ కల్వకోలు లక్ష్మీ దేవమ్మ ఫంక్షన్‌హాల్‌ సమీపంలోకి రాగానే ముందటి టైర్‌ పగిలిపోయింది. దీంతో ట్యా ంకర్‌ డివైడర్‌ను ఢీకొ టి బోల్తా పడింది. ట్యాంకర్‌ ఇంజిన్‌ నుంచి విడిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. గ్యాస్‌ లీకేజీ కాలే దు. ఈ ప్రమాదంతో ఔటర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 

Advertisement
Advertisement