Abn logo
Sep 13 2021 @ 00:13AM

పల్లె పదాల పరిమళత్వం ‘మట్టిమొగ్గలు’

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కవులు, రచయితలు

పుస్తకావిష్కరణలో వక్తలు

హిందూపురం టౌన, సెప్టెంబరు 12: మట్టిమొగ్గలు పుస్తకంలో మట్టివాసన, పల్లె పదాల పరిమళాలు స్పష్టంగా కనిపిస్తాయని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. రచయిత సడ్లపల్లి చిదంబర్‌రెడ్డి  రచించిన  మట్టిమొగ్గలు పుస్తకాన్ని హిందూపురంలోని ఓ ఫంక్షన హాల్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెజనం, పల్లెజీవనం, పల్లె పదాలకు పట్టాభిషేకం చేసిన రచయిత సడ్లపల్లేనన్నారు. మాండలీకంలో పుస్తకాలు రచిస్తూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సడ్లపల్లి రచనలు ఉంటాయన్నారు. మునిసిపల్‌ వైస్‌ చైర్మన బలరాంరెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రాంతాల మట్టివాసనల పరిమళాలను పరిచయం చేశారన్నారు. ఎఫ్‌1 టెక్నాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంగ్లం మోజులో తెలుగును తక్కువచేసి మాట్లాడటం సరికాదన్నారు. సడ్లపల్లి చిదంబర్‌రెడ్డి మాట్లాడుతూ మట్టిమొగ్గలు కథల్లోని పల్లెటూరి జీవితాలు స్థానిక ప్రజల అభిప్రాయాలు వారి ఆలోచనలు అనుగుణంగా పుస్తకం ర చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సొంటి కాంతిరావు, డాక్టర్‌ హరికిషన, తవ్వా వెంకటేశయ్య, నాగశేషు, ధనలక్ష్మీ, శాంతి నారాయణ, నాగముని, నాగరాజు, రామ్మోహనరెడ్డి, కొండారెడ్డి, గంగాధర్‌, ఏటిగడ్డ అశ్వత్థనారాయణ, తదితరులు పాల్గొన్నారు.