Abn logo
Jun 2 2020 @ 03:45AM

విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును రద్దుచేయాలి

ఆమనగల్లు: విద్యుత్‌ చట్టం సవరణ బిల్లు-2020ని వ్యతిరేకిస్తూ పట్టణంలోని విద్యుత్‌ సబ్‌-డి విజన్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు-2020 ముసాయిదాను తక్షణమే రద్దు చేయాలని సబ్‌-డివిజన్‌ ఏడీ రవీందర్‌, ఏఈ రమేశ్‌ కోరారు. కార్యక్రమంలో ఏఈ రాకేశ్‌, భరత్‌రెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement