Abn logo
Oct 14 2021 @ 00:32AM

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

భిక్కనూరులో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఏబీవీపీ నాయకులు

భిక్కనూరు, అక్టోబరు 13: కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ భిక్కనూ రు మండల కేంద్రంలోని సినిమా టాకీసు చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు బుధ వారం ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజయ్‌ మాట్లాడుతూ కశ్మీర్‌లో జవాన్లు, ఉపాధ్యా యుల మృతికి కారణమైన ఉగ్రవాదులను కాల్చి చంపాలని అన్నారు. అనం తరం పెద్దఎత్తున ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సమీర్‌ఖాన్‌, ప్రతినిధులు శివకృష్ణ, రాజేందర్‌, చందు, దత్తాత్రేయ, అజయ్‌, నవీన్‌, ప్రణీత్‌ తదితరులు పాల్గొన్నారు.