Abn logo
Jul 29 2021 @ 01:47AM

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం!

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌


కదిరి(చిత్తూరు): తంబళ్ళపల్లె మండలం కొటాల బోయపల్లెకు చెందిన ఓ ప్రేమజంట బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పిన ఒక వీడియా వైరల్‌ కావడం అనంతపురం జిల్లా కదిరిలో కలకలం రేపింది. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు....నాలుగు నెలల కిందట తంబళ్ళపల్లె నుంచి ఇద్దరు ప్రేమికులు పారిపోయారు. వారిలో యువతి గురించి ఆమె తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కదిరి మండల పరిధిలోని లగువమ్మకొండ సమీపంలో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగుతూ తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పిన వీడియో బుధవారం వైరల్‌ కావడంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలించారు. అయితే ఆ జంట ఆచూకీ దొరకలేదని సీఐ తెలిపారు.