Abn logo
Oct 22 2021 @ 22:28PM

చట్టాల ఏర్పాటుకు రాజ్యాంగమే మూలం

మాట్లాడుతున్న సీనియర్‌ న్యాయమూర్తి ఉదయ్‌కుమార్‌

లక్షెట్టిపేట, అక్టోబరు 22: దేశంలో ప్రస్తుతం మారుతున్న చట్టాలకు మూలం రాజ్యంగమేనని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉదయ్‌కుమార్‌ పేర్కొన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పటి నుంచే రాజ్యాంగ హక్కులు సంక్రమిస్తాయన్నారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మణచారి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో చదివి ఉన్నత ల క్ష్యాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ హైమా,  ఎంఈవో రవీందర్‌,  ప్రధానోపాధ్యాయురాలు యశోదర, న్యాయవాదులు అక్కల శ్రీధర్‌, పద్మ, అశోక్‌, వేల్పుల సత్యం, రవికుమార్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 

బెల్లంపల్లి: చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మం డల న్యాయ సేవా కమిటీ చైర్మన్‌ హిమబిందు పేర్కొన్నారు. శుక్రవారం హనుమాన్‌ బస్తీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.  మహిళలు రక్షణ చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేటప్పుడు అన్ని వివరాలు తెలుసుకుని పంపించాల న్నారు. బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌, న్యాయవాదులు గోపికరాణి, రాము, గోపి కిషన్‌, అశోక్‌, శివకుమార్‌, రాజేష్‌, సాయికుమార్‌ పాల్గొన్నారు.