Abn logo
Sep 26 2020 @ 04:42AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలి

డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి 


పరిగి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తాను చాటాలని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం పరిగిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ, మేధావి, విద్యావంతుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనాన్నరు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. కార్యక్రమాల్లో డీసీసీ ప్రధానకార్యదర్శులు, కె.హన్మంత్‌ముదిరాజ్‌, ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, డీసీఎమ్మెఎస్‌ మాజీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు బి.సుభాష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పరుశరాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కులకచర్ల మండల అధ్యక్షుడు బిఎస్‌ ఆంజనేయులు, నాయకులు భరత్‌కుమార్‌, సురేందర్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement