Abn logo
Oct 20 2020 @ 02:15AM

వరద బాధితులను గాలికొదిలేసిన సీఎం

Kaakateeya

మూల్యం చెల్లించుకోక తప్పదు

 కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు 

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 19: అతివృష్టితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి  తాడేపల్లిలోని ఇంటికే పరిమితమయ్యారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి, కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి హెచ్చరించారు. సోమవారం నగరంలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోట్ల మాట్లా డుతూ జగన్‌ సమీక్షలకే పరిమితమయ్యారని, త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు  వరదలు వస్తే సీఎం చంద్రబాబు బాధితుల వద్దకు వెళ్లి, ప్రజలకు సాయం చేశారని గుర్తు చేశారు. అయితే సీఎం జగన్‌  ప్రతిపక్ష నాయ కులపై కక్ష తీర్చుకోడానికే పరిమితం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ నుంచి ఇప్పటివరకు వర్షాలు కురుస్తుండటంతో రైతులకు కంటి మీద కునుకు లేదని అన్నారు. ఓ వైపు కరోనాతో  గిట్టుబాటు ధర లభించక ఇబ్బంది పడ్డారని అన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ వరద బాధితులను పరామర్శించేందుకు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తే, ఇప్పటికీ సీఎం జగన్‌కి తెలివి వచ్చి ఏరియల్‌ సర్వే చేసేందుకు సిద్ధమయ్యారని కోట్ల ఆరోపించారు.


సోమిశెట్టి మాట్లా డుతూ సీఎం జగన్‌ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వ్యవస్థలను నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క అవినీతి కేసులో కూడా ఇరుక్కోలేదని వివరించారు. చంద్రబాబుపై చిందులు వేస్తున్న జగన్‌కు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని, న్యాయ స్థానాల్లో ఆయనకు శిక్ష పడక తప్పదని స్పష్టం చేశారు. ప్రజలు తనకు 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాలను అందించారనే ధీమాతో, ఏం చేసినా చెల్లుతుందని జగన్‌ విర్రవీగుతున్నారని  ఇది మంచి పద్ధతి కాదని సూచించారు.

కార్యక్ర మంలో నాయకుడు ఆకేపోగు ప్రభాకర్‌, టీడీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌, హనుమం తరావు చౌదరి, జేమ్స్‌, సత్రం రామక్రిష్ణుడు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement