Abn logo
Apr 16 2021 @ 23:45PM

దండారీని కేంద్రం గుర్తించింది

ఉట్నూర్‌, ఏప్రిల్‌ 16: అనాదిగా కొనసాగిస్తున్న గోండుల దండారీ నృత్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. శుక్రవారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా గోండ్వాన పం చాయతీ రాజ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. గుస్సాడీ నృత్య కళాకరుడు కనక రాజును కేంద్రం పద్మశ్రీ అవార్డుతో గౌరవించడం గోండుల అదృష్టమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుస్సాడీ దండారీ ఉత్సవాలకు యేటా నిధులను విడుదల చేయాలన్నారు. ఇందులో జిల్లా మేడి మెస్రం దుర్గు, కుమ్రం భీం జిల్లా మేడి కోవ దేవ్‌రావు, ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి  దేవ్‌రావు, తో పాటు మాజీ ఎంపీ గోడాం నగేష్‌, ఐటీడీఏ ఏపీవో జనరల్‌ కనక భీంరావు,  ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కనక లక్కెరావు, కేబీ గ్రంధాలయ జిల్లా చైర్మన్‌ కనక యాదవ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement