Abn logo
Oct 13 2020 @ 01:35AM

జోరుగా హుషారుగా..!

Kaakateeya

ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల ఉత్సాహం

భారీగా దరఖాస్తులు.. ఆన్‌లైన్‌లోనే అధికం...

ఓట్ల చేర్పింపులో పార్టీలు నిమగ్నం


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ఓటర్ల నమోదులో పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలో జరగనున్న హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 6,855 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 6,320 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 535 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. వికారాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 4,555మంది పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆన్‌లైన్‌లో 4,422 మంది దరఖాస్తు చేసుకోగా, 133 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. తాండూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2300 మంది పట్టభద్రులు నమోదు చేసుకోగా, వారిలో 1898 మంది ఆన్‌లైన్‌లో, 402మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. 


వికారాబాద్‌ ముందంజ..

పట్టభద్రుల ఓటర్ల నమోదులో వికారాబాద్‌ మండలం 1,560 మందితో జిల్లాలో ముందంజలో ఉండగా, 103 మం దితో కోట్‌పల్లి మండలం చివరి స్థానంలో కొనసాగుతోంది. బంట్వారం మండలంలో 150మంది, నవాబుపేట మండలంలో 340మంది నమోదు చేసుకున్నారు. ధారూరు మండ లంలో 325 మంది నమోదు  చేసుకున్నారు. దోమ మండలంలో 216 మంది నమోదు చేసుకోగా, కులకచర్ల మండలంలో 381 మంది నమోదు  చేసుకున్నారు. మర్పల్లి మండలంలో 221 మంది నమోదు చేసుకోగా, మోమిన్‌పేట మండలంలో 368 మంది నమోదు చేసుకున్నారు. పరిగి మండలంలో 560 మంది, పూడూరు మండలంలో 331 మంది నమోదు చేసుకున్నారు. 


తాండూరు డివిజన్‌లో స్లో..

తాండూరు డివిజన్‌లో పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం నెమ్మదిగా కొనసాగుతోంది. బషీరాబాద్‌ మండలంలో 188మంది ఓటరుగా నమోదు చేసుకోగా, బొంరాస్‌పేట మండలంలో 290 మంది నమోదు చేసుకున్నారు. దౌల్తాబాద్‌ మండలంలో 245 మంది నమోదు చేసుకోగా, కొడంగల్‌ మండలంలో 282 మంది నమోదు చేసుకున్నారు. పెద్దేముల్‌ మండలంలో 232 మంది దరఖాస్తు చేసుకోగా, తాండూరు మండలంలో 852 మంది నమోదు చేసుకున్నారు. యాలాల్‌ మండలంలో 211 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ వచ్చే నెల 6వ తేదితో ముగియనుంది.అయితే.. రంగారెడ్డి జిల్లా ఓటర్ల నమోదు సంఖ్య అధికారులు లెక్క తేల్చలేదు.


మేడ్చల్‌ జిల్లాలో...

ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి : మేడ్చల్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం జోరుగా సాగు తోంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 రెవెన్యూ మండలాల్లో, 2 రెవెన్యూ డివిజన్లలో గ్రాడ్యుయేట్లు ఉత్సాహంగా ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు డివిజన్లలో ఆన్‌లైన్‌లో 20,226 మంది, ఆఫ్‌లైన్‌ 2,500మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అన్నిపార్టీలు కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి యువతకు సంబంధించిన ధ్రువీకరణ ప్రతాలను సేకరి స్తున్నారు. ప్రత్యేకంగా క్యాంపులను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఓటరు నమోదు ప్రక్రియను బాధ్యతలను అన్ని పార్టీలూ యువజన, విద్యార్థి సంఘాలకు అప్పగించాయి. 


అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం..

ఓటర్ల నమోదు ప్రక్రియను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌జిల్లాల ఎమ్మెల్సీగా బీజేపీకి చెందిన రాంచందర్‌రావు కొనసాగుతున్నారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. జేఏసీ సంఘాలతో పాటు వామపక్షాలు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను ప్రతిపాదిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌తోపాటు పలువురు పోటీ చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీరితోపాటు టీఆర్‌ఎస్‌, ఇతర సంఘాల నుంచి కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు. 

Advertisement
Advertisement