Abn logo
Oct 20 2020 @ 00:02AM

యువకుడి దారుణ హత్య

రైల్వేకోడూరు రూరల్‌, అక్టోబరు, 19: మండలం లోని రాఘవరాజపురం ప్రధానదారి పక్కనే సోమవారం తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రగుంట్ల మండలంలోని చిలమకూరుకు చెందిన క్రిష్ణమనాయుడుచంద్రకాంత్‌(39) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. రైల్వేకోడూరు ఎస్‌ఐ పెద్దఓబన్న కథనం మేరకు.... ఎర్రగుంట్ల మండలంలోని చిలమకూరు పంచాయతీ కి చెందిన క్రిష్ణమనాయుడుచంద్రకాంత్‌ అనే వ్యక్తి ఆర్‌టీపీపీలో డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు.


కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, హతుడు కలసి ఆదివారం రాత్రి రాఘవరాజపురం ప్రధాన రహదారి పక్కనే మూసి ఉన్న దుకాణంలో మద్యం తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. హత్యకు దారిసిన కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. క్రిష్ణమనాయుడుచంద్రకాంత్‌ను హత్య చేసి రోడ్డు పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వేకోడూరు ఎస్‌ఐ పెద్దఓబన్న, సిబ్బం ది తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Advertisement
Advertisement