Abn logo
Sep 24 2021 @ 23:13PM

తండ్రి మందలించాడని బాలుడి ఆత్మహత్య

హరికృష్ణ(ఫైల్‌)

- సెల్‌ఫోన్‌ విషయమై చిన్నారుల మధ్య గొడవ

పెంచికలపేట, సెప్టెంబరు 24: తండ్రి మందలించాడని పురుగుల మందు తాగి బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సైరమేష్‌ తెలిపిన వివరాలప్రకారం.. మొట్లగూడ గ్రామానికి చెందిన చౌదరిమహేష్‌,లక్ష్మి దంపతులకు ఇద్దరుసంతానం. పెద్ద వాడైన హరికృష్ణ(14) గురుకుల పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. ఐతేకరోనా నేపథ్యంలో ఇంటివద్దనే ఉంటున్నాడు. గురువారం సెల్‌ఫోన్‌ విషయంలో సోదరుడు జశ్వంత్‌తో గొడవపడ్డాడు. ఈక్రమంలో తండ్రి మందలించాడు. దీంతో మన స్థాపం చెందిన హరికృష్ణ ఇంట్లోఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారంరాత్రి మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.