Abn logo
Dec 2 2020 @ 00:02AM

రైతులపై దాడి అమానుషం: బొర్రన్న

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 1: కొత్తగా తెచ్చిన రైతు వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని, రైతు సమస్యలను పరిష్కరించాలని ‘చలో ఢిల్లీ’కి వెళ్లిన రైతులపై జల ఫిరంగులతో దాడి చేయడం అమానుషమని ఈ దాడిలో మృతి చెందిన రైతులను ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్‌ చేశారు. రైతుల మృతిని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం చేయించిన దాడిని ఖండిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌చౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంగెపు బొర్రన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నదాతలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాల్సిన కేంద్రలోని బీజేపీ కార్పొరేట్‌, పెట్టుబడిదారులకు అనుకూలంగా తెచ్చిన రైతు వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ర్టాల నుంచి చలో ఢిల్లీకి వచ్చిన రైతులపై చేసిన దాడితో కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రైతుల మృతికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన జీవోలను ఉప సంహరించుకోవాలని కోరారు. లేనిపక్షంలో రైతులకు అండగా ఉండి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో నాయకులు బండి దత్తాత్రి, దర్శనాల మల్లేష్‌, నాయకులు రమేష్‌, లోకారి పోశెట్టి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement