Abn logo
May 7 2020 @ 00:31AM

ఆత్రేయ శతజయంతి

ప్రముఖ నాటక, సినీ రచయిత ఆత్రేయ 1921 మే 7వ తేదీన జన్మించారు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా గతంలో మనస్విని ట్రస్ట్ ప్రచురించిన ‘ఆత్రేయ సాహితి’లోని సుమారు 1100 పాటలకు యిప్పుడు అదనంగా సేకరించిన 500 పాటలను చేర్చి ఆత్రేయ సమగ్ర సినీ గీతాలను రెండు సంపుటాలుగా శ్రీయుతులు యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఐ. వరప్రసాదరెడ్డి గార్ల సౌజన్యంతో వెలువరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆత్రేయ అభిమానుల చిరకాల వాంఛ అయిన ఈ ప్రయత్నాన్ని వారు స్వాగతిస్తారని; శతజయంత్యుత్సవాలను ఈ లాక్‌డౌన్ ముగిసిన తరువాత వివిధ కేంద్రాలలో నిర్వహిస్తారని ఆశిస్తూ, ఈ సమాచారాన్ని తెలియపరుస్తున్నాను.

పైడిపాల (99891 06162)

Advertisement
Advertisement
Advertisement