Abn logo
Oct 24 2020 @ 05:58AM

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

వర్ధన్నపేట, అక్టోబరు 23 : వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు రాయపురం కుమారస్వామి డిమాండ్‌ చేశారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ వర్ధన్నపేట తహసీల్దార్‌ ఏవీ భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కాగా, పట్టణ బీజేపీ నాయకులు కొండేటి సత్యం, మధుసూదన్‌, శ్రీనివాస్‌, రవి, అనిల్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేయడం విచారకరమన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు బొంపెల్లి దేవేందర్‌రావు, రైతులు, యువకులు పాల్గొన్నారు.


పరకాల: బీజేపీ జాతీయ కౌన్సిల్‌ మెంబర్‌ మేకల రాజవీరు ఆధ్వర్యంలో రైతులను ఆందుకోవాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో మార్త భిక్షపతి, పుట్ట రవిందర్‌, మేఘనాథ్‌, భద్రయ్య, నిరంజన్‌, విజయ్‌, మహేందర్‌రెడ్డి, తిరుపతి తదితరులు ఉన్నారు.


నర్సంపేట: రైతులకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌)జిల్లా అధ్యక్షుడు గుంటి రాంచందర్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ జావిద్‌, బొనగాని రవీందర్‌, బొట్ల పవన్‌, గుంటి సంజీవ, చందు, రబ్బాని, పాల్గొన్నారు.


రాయపర్తి:  సీపీఐ జిల్లా నాయకుడు గుగులోతు నానునాయక్‌  ఆధ్వర్యంలో తహసీల్దార్‌ సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు యాకయ్య, రంగారావు, ఆరెల్లి ఎల్లయ్య, గుగులోతు వెంకన్న పాల్గొన్నారు. 

Advertisement
Advertisement