Jun 19 2021 @ 12:19PM

'ఖిలాడి'లో హైలెట్‌గా నిలవనున్న యాక్షన్స్ సీన్స్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖిలాడి'. ఇందులో యాక్షన్ అండ్ ఛేజింగ్ సీన్స్ మూవీకి మెయిన్ హైలెట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింస్ బాగానే అంచనాలు పెంచాయి. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలోని కొంత టాకీపార్ట్ అండ్ యాన్షన్ సీన్స్, భారీ ఛేజింగ్ సీన్స్‌ను ఇటలీలో చిత్రీకరించారు. ఈ యాక్షన్ అండ్ ఛేజింగ్ సీన్స్ 'ఖిలాడి' సినిమాకి బాగా హైలెట్ అవుతాయని మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన చిన్న వీడియోతో అర్థంవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పెన్ స్టూడియోస్ - ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.