Advertisement
Advertisement
Abn logo
Advertisement

చదువులో వెనుకబడ్డానని... విద్యార్థి ఆత్మహత్య

కడప(క్రైం), నవంబరు 27 : కడప నగరం నెహ్రూనగర్‌లో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిన్నచౌకు ఎస్‌ఐ అమర్‌నాథరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ వివరాల మేరకు కొరివి వెంకటసాయిప్రదీప్‌(18) పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతదేహం వద్ద మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. తనకు చదువు సరిగా రావడం లేదని నేను అన్నింటిలో ఫెయిల్యూర్‌ అవుతున్నానని నేను ఉండలేకపోతున్నాని, నా చావుకు ఎవరూ కారణం కాదని, ఐ లవ్యూ అమ్మా, నాన్న అంటూ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. దానిని స్వాధీనం చేసుకుని మృతుడి తండ్రి వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement