Abn logo
Sep 22 2020 @ 05:49AM

ఆదమరిస్తే అంతే..!

Kaakateeya

 పెదపాడు-వట్లూరు రోడ్డు గోతులతో అధ్వానంగా మారింది. ఈ మార్గం లో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేయగా, వాటిని ధ్వంసం చేసి మరీ భారీ వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి. దీంతో రోడ్డు మరింత దెబ్బతిని పెద్దపెద్ద గోతులు పడ్డాయి. వీటిలో పడి ప్రమాదానికి గురి కాకుండా గోతులను గుర్తించేందుకు వీలుగా స్థానికులు కర్రలు పాతి పెట్టారు. అయినా రాత్రిపూట ఇవి గమ నించని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.

                                                                         -పెదపాడు 

Advertisement
Advertisement
Advertisement