Abn logo
Jan 18 2021 @ 05:52AM

ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

13 మందికి గాయాలు

కన్నౌజ్ (ఉత్తరప్రదేశ్): ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఆదివారం రాత్రి రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. తిర్వా పోలీసుస్టేషను పరిధిలో ఆదివారం అర్దరాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు. అతివేగం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement