Abn logo
Aug 2 2021 @ 00:10AM

కొవిడ్‌లో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం

వైద్య ఆరోగ్య సిబ్బందిని సత్కరిస్తున్న వాసవీ క్లబ్‌ కార్యవర్గ సభ్యులు

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 1 : కొవిడ్‌ కష్ట కాలంలో వైద్య సిబ్బంది అభినంద నీయమని వాసవీ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ రేపాక ప్రవీణ్‌ భాను అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బందిని వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం గామాస్‌ ఫంక్షన్‌ హాలులో 51 మందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎ.ప్రతాప్‌ కుమార్‌, డాక్టర్‌ కె.అశ్వనీ, డాక్టర్‌ సాహిత్య, ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు, వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌.మురళీ కృష్ణ, పీరాట్ల శ్రీను, ఖండవల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.