Abn logo
Mar 6 2021 @ 09:24AM

ఆ విమర్శలను పట్టించుకోను: తమన్

`అల వైకుంఠపురములో..` వంటి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు ఎస్ఎస్ తమన్. ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అగ్ర హీరోలతో కలిసి పనిచేస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఛాట్ చేసిన తమన్ వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. సూపర్‌స్టార్ మహేష్ `సర్కారు వారి పాట`కు కూడా తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మహేష్ అభిమాని ఆ సినిమా అప్‌డేట్ గురించి అడిగాడు. దానికి స్పందించిన తమన్.. ``సర్కారు వారి పాట` నుంచి తప్పకుండా మీకెన్నో సర్‌ప్రైజ్‌లు వస్తాయి. ఆ సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. కాబట్టి, సర్‌ప్రైజ్‌లు కోసం కొంత సమయం వేచి ఉండండి. ఆగస్టులో తప్పకుండా మనం కలుసుకుందాం (సాంగ్స్‌ రిలీజ్‌)` అని తమన్ పేర్కొన్నాడు. అలాగే తన సంగీతంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. `అలాంటి వాటి గురించి పట్టించుకుని నా సమయాన్ని వృథా చేసుకోను. నా సంగీతంపై ట్రోల్స్ క్రియేట్ చేయడం కోసం వారే తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నార`ని చెప్పాడు. అలాగే తన దృష్టిలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ `ఒక నిజమైన లీడర్` అని చెప్పాడు. 

Advertisement
Advertisement
Advertisement