Abn logo
May 28 2020 @ 23:53PM

తలసాని సేవా ట్రస్ట్‌ సాయం... 14వేలమంది సినీ, టీవీ కార్మికులకు

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వెండితెర, బుల్లితెర కార్మికులను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, ఆయన తనయుడు సాయికిరణ్‌ యాదవ్‌ సాయం అందించారు. తలసాని సేవా ట్రస్ట్‌ ద్వారా 14 వేలమంది సినీ, టీవీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్‌ అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో గురువారం ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభించారు. చలనచిత్ర ప్రముఖులు అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌, ‘దిల్‌’ రాజు, కొరటాల శివ, సూర్యదేవర రాధాకృష్ణ, ఎన్‌. శంకర్‌, సి. కళ్యాణ్‌, రామ్మోహన రావు చేతుల మీదుగా కార్మిక సంఘాల నాయకులకు సరుకులు అందజేశారు. చిత్ర పరిశ్రమలో 24 శాఖలలో కార్మికులకు ఆయా సంఘాలు నిత్యావసరాలు అందజేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిషేక్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement