బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్, విక్టర్ అక్సెల్సెన్ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విక్టర్ (డెన్మార్క్) 21-14, 21-14తో ఆగ్నస్ (హాంకాంగ్)పై, మహిళల తుదిపోరులో మారిన్ (స్పెయిన్) 21-9, 21-16తో టాప్‌సీడ్ తై జు యింగ్ (తైవాన్)పై గెలిచారు.