Abn logo
Aug 3 2021 @ 18:23PM

ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు... టీఎఫ్‌సీఐఎల్ చేయూత

న్యూఢిల్లీ : ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద మీడియం, స్మాల్, మైక్రో యూనిట్లకు కేంద్ర టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో... ప్రస్తుత సంవత్సరంలో రూ. 234.70 కోట్లను మంజూరు చేసింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్యాకేజీని అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే ‘ఈ-వీసా’లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా... పర్యాటకులకు తగిన సహకారాన్నందించే క్రమంలో... 24x7 టోల్ ఫ్రీ మల్టీలింగ్వల్ టూరిస్ట్ హెల్ప్ లైన్ సర్వీసులను కూడా అందిస్తోంది.


మరోవైపు దాదాపు ఐదు లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగా ‘ఈ-వీసా’లను మంజూరు చేయనున్నారు. కాగా... సంబంధిత మంత్రిత్వ శాఖకు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే... రానున్న రోజుల్లో పెద్దసంఖ్యలో... అర్హులకు చేయూతనందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.