Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం

సిద్దిపేట: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ ప్రధాన రహదారి పక్కన అదుపు తప్పి కారు బావిలో పడింది. సమాచారం అందుకున్న పలు శాఖల సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావి నుంచి కారును తీసే ప్రయత్నం చేస్తున్నారు. రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు కారు వెళ్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బావి నుంచి నీటిని అధికారులు తోడివేస్తున్నారు. దాదాపు 45 నుంచి 60 లోతున బావి ఉంది. స్థానిక ఎమ్మెల్యే రఘనందన్ రావు అక్కడికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కారులో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియ రాలేదు. ఫొటోల కోసం క్లిక్ చేయండి


అయితే కారులో నిజాంపేట్‌కు చెందిన తల్లి, కొడుకు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. తల్లి భాగ్యలక్ష్మి, కొడుకు ప్రశాంత్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగు మోటర్లతో బావిలో నీటిని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది తోడుతున్నారు. బావిలోకి గజ ఈతగాళ్లు దిగారు. కారును బయటకు వెలికితీసే యత్నం చేస్తున్నారు. Advertisement
Advertisement