Abn logo
Jan 17 2021 @ 21:04PM

ఇది ఫుడ్డా?.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ ప్లేయర్లు!

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ చేరుకున్న టెన్నిస్ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఆ ప్లేయర్లకు అందిస్తున్న ఆహారం మరీ దారుణంగా ఉందట. వీళ్లను క్వారంటైన్‌లో ఉంచిన హోటల్లో ఆహార పదార్థాల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ప్లేయర్లు.. దాని క్వాలిటీని తిట్టిపోస్తున్నారు. ప్రపంచ నెంబర్ 15 పాబ్లో కారెనో బస్తా.. తనకు అందించిన సలాడ్, యాపిల్ జ్యూస్ కప్ ఫొటోలను షేర్ చేశాడు. ‘నిజంగా?’ అంటూ తన ఆహారం ఫొటోలను ఫ్రెంచ్ ప్లేయర్ బెనోయిట్ పైర్ పోస్టు చేశాడు. దీంతో విసుగెత్తిన ప్లేయర్లు మెక్‌డొనాల్డ్ నుంచి ఆర్డర్లు తెప్పించుకొని తిన్నారట. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement