Abn logo
Mar 1 2021 @ 01:53AM

టెన్‌కాశీలో పుష్ప

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా తమిళనాడులో సందడి చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం టెన్‌కాశీలో జరుగుతోంది. ఇటీవల మారేడుమిల్లిలో ఓ పాట, పలు సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం టెన్‌కాశీ చేరుకుంది. అక్కడ హీరోహీరోయిన్లపై సాగే సన్నివేశాలతోపాటు సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఓ పాటను కూడా తెరకెక్కించనున్నారని సమాచారం. మైతీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 13న విడుదల కానుంది. 


Advertisement
Advertisement
Advertisement