Abn logo
Jul 15 2020 @ 09:25AM

తెనాలిలో 58 కేసులు.. ఒకరి మృతి

తెనాలి అర్బన్‌: ఒక్కరోజే తెనాలి ప్రాంతంలో 58 కేసులు వెలుగుచూశాయి. ఓ వ్యక్తి మృతి చెందడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రూరల్‌ మండలం గుడివాడ, సంగం జాగర్లమూడిలో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు. పట్టణంలోని గంగానమ్మపేటలో 36 మందికి పాజిటివ్‌గా అధికారులు గుర్తించారు.  ఇక్కడ గతంలో పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్టులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించారు.   అమరావతి ప్లాట్స్‌లో మూడు, ఐతానగర్‌లో నాలుగు, సాలిపేట, చినరావూరు, ఆర్‌ఆర్‌నగర్‌, సుల్తానాబాద్‌లో రెండు, ఇస్లాంపేట, మారీసుపేట, కొత్తపేట, గాంధీచౌక్‌,  క్వారంటైన్‌ సెంటర్‌ ఒక్కో కేసు నమోదు అయ్యాయి. ఐతానగర్‌కు చెందిన ఒకరు కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిసింది. రెవెన్యూ శాఖలో కీలక అధికారి ఒకరు కరోనా బారిన పడ్డారు. జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం కూడా కరోనా భారిన పడుతున్నారు.


దీంతో తెనాలిలో చర్యలు తీసుకునే వారు కరువయ్యారు. స్వాబ్‌ తీశాక రోజులతరబడి పరీక్షలు పెండింగ్‌లోపెట్టడం ఈలోపు బాధితులు అనేక ప్రాంతాల్లో తిరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తి చెందుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెనాలి పట్టణంలో తొలి కేసు నమోదయిన తర్వాత అవి పెరుగుతూ 50 కేసులు కావటానికి నెలకుపైగా పడితే, అవికాస్తా 250 దాటిపోవడానికి మాత్రం కేవలం వారం రోజులే పట్టింది. కేసులు ఎక్కువగా ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయ ప్రాంతం, నాజరుపేట, కొత్తపేట, రామలింగేశ్వరపేట తదితర రెడ్‌జోన్‌ ప్రదేశాలను మూసివేయకుండా వదిలేశారు.  

Advertisement
Advertisement
Advertisement