Abn logo
May 25 2020 @ 04:37AM

పకడ్బందీగా ‘పది’ పరీక్షలు

ఒక్కో పరీక్ష నిర్వహణకు రెండు రోజుల వ్యవధి 8 ఉచితంగా మాస్కుల పంపిణీ

కరోనా నేపథ్యంలో 84కు పెరిగిన పరీక్ష కేంద్రాలు 8 పాత హాల్‌ టికెట్లతోనే పరీక్షలు


మహబూబ్‌నగర్‌ (విద్యా విభాగం), మే 24 : వాయిదా పడిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించడంతో, జిల్లా విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. జూన్‌ 8వ తేదీ నుం చి జూలై 5 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి, పరీక్షల నిర్వహణ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖకు సూచించింది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజులు విరామం ఉండాలని, విద్యార్థులు పరీక్షల హాలులో భౌతికదూరం పాటించేందుకు పరీక్ష కేంద్రలను పెంచాలని స్పష్టం చేసింది. దీం తో మహబూబ్‌నగర్‌ జిల్లాలో గతంలో 60 పరీక్ష కేంద్రాలు ఉండగా, ఇప్పుడు వాటిని 84కు జిల్లా విద్యా శాఖ పెంచింది. మొత్తం 12,300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, పరీక్ష హాలులో ఒక్కో గదిలో పది మంది విద్యార్థులు కూర్చునేలా, ఒక్కో బెంచిలో ఒకరు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నది.


ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై విద్యా శాఖ అధికారులు, చీప్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధి కారులతో శనివారం డీఈవో ఉషారాణి సమీక్షించారు. పరీక్ష కేంద్రాలలో కరోనా నివానణ చర్యలు తప్పని స రిగా పాటించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలు మారిన విద్యార్థులకు ముందస్తుగా హెచ్‌ఎంలు సమా చారం ఇవ్వాలని, పాత హాల్‌ టికెట్స్‌తోనే పరీక్షలకు హాజరు కావాలని చెప్పారు. ఉదయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులకు థర్మల్‌ స్కానింగ్‌ చేసిన తర్వతే, పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వాలని అన్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారికి ప్రత్యేక గదిలో పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారన్నారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని డీఈవో సూచించారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా మాస్కులు అందించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేయనున్నారు. 

Advertisement
Advertisement