Abn logo
Oct 19 2020 @ 03:47AM

కాగ్నా నది పాత బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు

తాండూరు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలుగోసారి కొట్టుకుపోయిన తాండూరు-కొడంగల్‌ రోడ్డులోని కాగ్నా నది పాత బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గత మూడు నాలుగు రోజులుగా తాత్కాలికంగా మరమ్మతు లు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ పనులు ఆదివారం ముగియడంతో చిన్న వాహనాల రాకపోకలకు కొంత మేరకు ఇబ్బందులు తొలిగాయి. కొత్తబ్రిడ్జిని త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement