Abn logo
Aug 1 2021 @ 01:33AM

ఆధ్యాత్మికత పెంపొందించేలా ఆలయాలను తీర్చిదిద్దాలి

జిల్లెలగూడ ఆలయంలో రథశాలను ప్రారంభిస్తున్న మంత్రి సబితారెడ్డి

సరూర్‌నగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): బాలాపూర్‌ మండలం జిల్లెలగూడలోని శ్రీఅలర్‌మేల్‌ మంగ పద్మావతీ సమేత శ్రీమత్స్యావతార శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులను శనివారం మంత్రి పి.సబితారెడ్డి ప్రారంభించారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన రథశాలతో పాటు జీర్ణోద్ధరణలో భాగంగా అభివృద్ధి చేసిన నేల మాళిగలు, దశావతారాలను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రాజా సంజయ్‌ గోపాల్‌ సైంచర్‌, ఈవో మురళీకృష్ణ, మీర్‌పేట్‌ మేయర్‌ ఎం.దుర్గాదీ్‌పలాల్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రమ్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ భక్తుల్లో ఆధ్యాత్మికత పెంపొందించేలా ఆలయాలను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.