Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.5.50 కోట్లతో ఆలయ విస్తరణ పనులు

రాచర్ల, డిసెంబరు 2 : మండలంలోని జెపుల్లలచెరువు గ్రామసమీపాన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయ అభివృద్ధి ప నులకు గురువారం ఎమ్మెల్యే అన్నా రాంబాబుతోపాటు దేవదాయశాఖ అధికారులు పరిశీలించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, దేవదాయ అధికారులు కలిసి ఆలయ అభివృద్ధి మ్యాప్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూరూ.5.50 కోట్లతో ఆలయ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు, మూడు అంతస్తులుగా నిర్మాణ పనులు చేపట్టి, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అన్నదానం, మొదటి అంతస్తులో కేశ ఖండన, రెండవ అంతస్తులో కార్యాలయం ఉండేలా నిర్మాణాలు చేపడతారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట ప్రకాశం జిల్లా సర్పంచ్‌ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్‌, వైసీపీ నాయకులు పగడాల శ్రీరంగం, షేక్‌ మౌళాలి, జెట్టి వెంకటేశ్వర్లు, కన్నసాని ఓబులేసు, నరసింహులు, రంగస్వామిరెడ్డి, సర్పంచ్‌లు శిరిగిరి రమేష్‌, గోతం వెంకట నారాయణ పాల్గొన్నారు.


Advertisement
Advertisement