Abn logo
Oct 11 2020 @ 05:42AM

ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలి

 తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎండీ యాసిన్‌


ఘట్‌కేసర్‌: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను వెంటనే రద్దు చేయాలని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాసిన్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఘట్‌కేసర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం పడేవిధంగా ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను ప్రవేశపెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్సలు అందించడంతోపాటు  కరోనాతో మృతిచెందిన వారి కుటుంబీకులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులను ఆరికట్టేందుకు వెంటనే మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.


లక్ష ఇళ్లు అని చెప్పి నాలుగు వేలు చూపించడం విచారకరమన్నారు. అనంతరం తెలుగుయువత రాష్ట్రకార్యదర్శి అమర్‌చంద్‌ మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అఽధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయారని ఆరోపించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు వేముల సంజీవగౌడ్‌ మాట్లాడుతూ మండలంలో పార్టీని బలోపేతం చేసేందుకు పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చెన్నప్న, సిస్టా సూర్యనారాయణ, మడ్డి రాము తధితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement