Abn logo
Sep 27 2020 @ 17:04PM

బిగ్‌ బాస్‌ 4లోకి మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ బ్యూటీ విశేషాలివే..

Kaakateeya

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతోన్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 షో.. రోజురోజుకీ మార్పు వస్తుంది. మరీ ముఖ్యంగా ఈసారి బిగ్‌ బాస్‌ గ్లామర్‌ డోస్‌నే నమ్ముకోవడం విశేషం. వారం వారం ఇంట్రెస్టింగ్స్ టాస్క్‌లతో ప్రేక్షకాభిమానం‌ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న బిగ్‌బాస్ 4 హౌస్‌లోకి మరో కీలకమార్పు చోటు చేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో గ్లామర్‌ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా.. బిగ్‌బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు ఇలా బ్యూటీస్‌ని దింపుతున్నారా.. అనిపించేంతగా ఈ షో నడుస్తుంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేశారు. ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్‌ను బిగ్ బాస్-4వ సీజన్‌ హౌస్‌లోకి పంపించారు. చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ స్టైల్. వీటి కోసమే సెపరేట్ టాస్క్‌లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన హీరోయిన్‌ స్వాతి వస్తూ వస్తూనే షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించింది.

అయితే రెండేళ్ల క్రితమే స్వాతికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, ఈ సీజన్‌కు తన ఎంట్రీ అవసరం ఉందని స్వాతి డిసైడ్ అయింది.‌ నటిగా ఇప్పటికే బెంగాలీ, తమిళ, తెలుగు సినిమాలతో అలరించిన స్వాతి, హౌస్ మేట్‌గా బిగ్ బాస్‌లో అదరగొట్టేస్తానని చెబుతుంది‌. వాస్తవానికి ఆర్.ఎక్స్. 100 సినిమాలో ఫస్ట్ స్వాతినే హీరోయిన్. వారంపాటు షూటింగ్ చేసిన తర్వాత, ఆ బోల్డ్ రోల్, తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గది కాదనీ, సినిమా నుంచి తప్పుకుంది. పర్సనల్‌గా స్వాతి నటిగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే తన‌ తండ్రిని కోల్పోయింది. ఆ బాధను తట్టుకుని, మరొపక్క  కుటుంబ బాధ్యతలను కూడా తనపై వేసుకుని, తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది స్వాతి దీక్షిత్‌.

ఇక తెలుగు ప్రేక్షకుల ఆదరణ, ఓ తెలుగమ్మాయిగా తనకు ఉంటుందని ఆశిస్తున్నట్లుగానూ, తనవంతుగా ది బెస్ట్ కంటెస్టెంట్‌గా ఈ రియాలిటీ షోలో గుర్తింపు తెచ్చుకుంటానని స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి అడుగెట్టే ముందు తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement